పెన్‌పహాడ్, జూలై 10 : పెన్‌పహాడ్ మండల నూతన ఎస్ఐగా బాలు నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కాస్తాల గోపి కృష్ణ సూర్యాపేట టూ టౌన్‌కు బదిలీ కాగా, వి.ఆర్ లో ఉన్న బాలు నాయక్ పెన్‌పహాడ్ ఎస్హెచ్ఓగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ బాలు నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ఎవరైనా, ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.