చిట్యాల, డిసెంబర్ 26 : ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మండలంలోని వట్టిమర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు రాసిన ‘బాలల కథల బండి’ పుస్తకాన్ని సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో ఆమె ఆవిష్కరించి మాట్లాడారు.
విద్యార్థులను ప్రోత్సహించి రచనలు రాయించడం, వాటిని పుస్తక రూపంలోకి తీసుకురావడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా పుస్తక సంపాదకులు పెరుమాళ్ల ఆనంద్, పొట్టబత్తుల రామకృష్ణను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణారావు, ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య, అశోక్ అభినందించారు. కార్యక్రమంలో సాగర్ల సత్తయ్య, ఉప్పల పద్మ, స్వామి, మెంతబోయిన సైదులు, మధు పాల్గొన్నారు.