మిర్యాలగూడ, సెప్టెంబర్ 24 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఇద్దరు మాజీ వార్డు సభ్యులతోపాటు 200 మంది కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండల యువజన అధ్యక్షుడు పిండి సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ వారు మాట్లాడుతూ గత పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగం లాంటిదని పేర్కొన్నారు.
అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి వారికి బాసటగా నిలిచిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో శీలం సైదులు, యాట నాగమ్మ, రేవెల్లి రామచంద్రు, శీలం లింగయ్య, మద్దుల రవి, ఉత్తెర్ల లింగయ్య, దొంతిరెడ్డి రాంరెడ్డి, కృష్ణారెడ్డి, ఉత్తెర్ల శ్రీను, బచ్చలకూరి సైదులు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మిర్యాలగూడ మండలాధ్యక్షుడు సైదులుయాదవ్, ఎంపీటీసీ శ్రీరాంరెడ్డి, నాయకులు నాగిరెడ్డి, చంద్రయ్య, రవీందర్‌నాయక్, వెంకటేశ్వర్లు, రామచంద్రు పాల్గొన్నారు.