నీలగిరి, ఆగస్టు 26 : అన్నేపర్తిలోని 12వ బెటాలియన్ కమాండెంట్‌గా బి.రామకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 12వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న వీరయ్య హైదరాబాద్‌కు బదిలీ కావడంతో హైదరాబాద్‌లోని రామకృష్ణ బదిలీపై ఇక్కడకు వచ్చారు. 12వ బెటాలియన్‌లో అదనపు కమాండెంట్‌గా ఇప్పటికే విధులు నిర్వర్తించిన ఆయన బెటాలియన్‌పై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. అంతకుముందు ఆయనకు బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ బెటాలియన్ పురోగతికి, సిబ్బంది సంక్షేమానికి, క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి బెటాలియన్ పేరు ప్రఖ్యాతులను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అనంతరం బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ ఎల్.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, ఏవో దయాకర్, మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలా ధేవి, నితిన్ గౌతమ్, ఆర్ఎలు. ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, ఆఫీస్ సూపరింటెండెంట్, మినిస్టీరియల్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు.