నీలగిరి, మే17 : నల్లగొండ మండలంలోని అన్నేపర్తి 12వ బెటాలియన్లో తెలంగాణ పోలీస్ శాఖ, అత్మహత్యల నివారణ ” కమిటీ ఆధ్వర్యంలో శనివారం అత్మహత్యల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ కె.వీరయ్య కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ అశోక్ పరికిపండ్ల ముఖ్య అతిధిగా హజరై మాట్లాడారు. అత్మహత్యల వెనుక ఉన్న మానసిక, సామాజిక కారణాలు, వాటి పరిష్కార మార్గాలు, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నివారణపై అవగాహన కల్పించారు.
ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు బంధువులు, స్నేహితులతో పంచుకుని వాటి పరిష్కార మార్గాలను వెతకాలని సూచించారు. అంతేగానీ ఆధైర్యపడవద్దని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు రామోజీరావు, శ్రీనివాసులు, సుజనారెడ్డి, శుభ, అసిస్టెంట్ కమాండెంట్ సీహెచ్ అంజనేయరెడ్డి, మెడికల్ ఆఫీసర్ షర్మీల, ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.