దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 18 : ఈ నెల 17 నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులు, బాలింతలు, గర్భిణీల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ఆరోగ్యవంతంగా ఉండడం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో గురువారం దేవరకొండ రూరల్ మండలం బొడ్డుపల్లి గ్రామంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీడీపీఓ చంద్రకళ మాట్లాడుతూ.. పోషక విలువలు కలిగిన ఆహారం, ఆహార పదార్థాలు, ఆకుకూరలు, మిల్లెట్స్, చిరుధాన్యాలు, పరిశుభ్రత ప్రాముఖ్యతను గర్భిణులు, పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ అనురాధ, బొడ్డుపల్లి పీహెచ్సీ డాక్టర్ విజయ, హెల్త్ సూపర్వైజర్ సఫియా, సూపర్వైజర్ ఎన్. రాధా, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు రాజమణి ,లక్ష్మి, భవాని, పరిమళ, సువర్ణ పాల్గొన్నారు.