కనగల్, మే 18 : కలెక్టర్, డీఆర్డీఓ ఆదేశాల మేరకు కనగల్ మండలంలో జల సంచాయ్ జెన్ బాగిదరి- జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని చిన్నమాదారం, చెట్లచెన్నారం, ఎస్.లింగోటం, తెలంకంటిగూడెం, ఇస్లాంనగర్ గ్రామ పంచాయతీల్లో తెలంగాణ సంస్కృతి సారథ్యం ఆధ్వర్యంలో కళాజాత బృందం ఆయా గ్రామాలలో నీటి సంరక్షణ పనులు, నీటిని ఒడిసి పట్టడంపై అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, భవనాల పైకప్పు రీఛార్జ్ స్ట్రక్చర్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, కాల్వల్లో పూడిక మట్టి తీయడం, చెరువుల్లో పూడిక మట్టి తీయడం, పారంపాడు, చేపల చెరువుల పనులు, ప్లాంటేషన్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి వాతావరణ సమస్థితిని కాపాడాలని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అదనపు కార్యక్రమాధికారి ఏపీఓ భీమనపల్లి సుధాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, కళాజాత బృంద నాయకురాలు పుష్పలత, బృంద సభ్యులు, సాంకేతిక సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డ్ సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.