కోదాడ రూరల్, జులై 10 : కోదాడ రూరల్ మండల పరిధి తొగర్రాయి శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందిన 20 ఎకరాల కౌలుకు గురువారం వేలం నిర్వహించారు. భూమి నాలుగు రకాలుగా విభజించి వేలం నిర్వహించారు. 3.30 ఎకరాల భూమిని గ్రామానికి చెందిన జడ వెంకటేశ్ రూ.80 వేలు, 5.00 ఎకరాల భూమిని పులి సులోచనరావు రూ.1.85 లక్షలకు, 1.30 ఎకరాల భూమిని రూ.13 వేలకు అలాగే 10.08 ఎకరాల భూమిని రూ.3.22 లక్షలకు చిల్లా లింగయ్య దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ కోదాటి భాస్కర్, దేవాలయ కమిటి చైర్మన్ అమరనాయిని వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. దేవాలయ భూముల కౌలుకు వేలం పాడిన వారు గడువు లోపు నగదు చెల్లించాలన్నారు. లేని ఎడల వేలం రద్దు చేసి తిరిగి వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈఓ తుమ్మల వెంకటచలపతి, ఆలయ పూజారి నందుల లక్ష్మినారసింహాశాస్త్రీ, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.