హాలియా, సెప్టెంబర్ 4 : వరద బాధితులను ఆదుకునేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడిచేయడం హేయమైన చర్య అని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియాలోని తమ నివాసంలో బుధవారం రాష్ట్ర ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా విఫలం చెందినదన్నారు. ప్రభు త్వం వైఫల్యం కారణంగానే ఖమ్మం పట్టణం నీట మునిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నా రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడి చేసిన దాఖలాలు లేవని చెప్పా రు. ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే తమ పార్టీ కార్యకర్తలు, గూండాలతో దాడి చేయించారని మండిపడ్డారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ తలాపున కృష్ణమ్మ పరిగెడుతున్నా ఈ నియోజకవర్గంలో ప్రజలకు తాగు, సాగు నీరు కరువైందన్నారు. గత నెల రోజులుగా నాగార్జున సాగర్ జలాశయం నుంచి 200 టీఎంసీల నీరు సముద్రం పాలైందే తప్ప పక్కన్నే ఉన్న చెరువులు మాత్రం నింపలేదని అన్నా రు. ఏఎమ్మార్పీ, వరదకాల్వ, ఎడమ కాల్వ నీటితో చెరువులన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో సగం మంది రైతులకే రుణమాఫీ వచ్చిందని, సమస్య చెప్పేందుకు వెళ్తే ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
సమావేశంలో అనుముల, పెద్దవూర బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కురాకుల వెంకటేశ్వ ర్లు, రవినాయక్, పట్టణ అధ్యక్షుడు వడ్డె సతీశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, కామర్ల జానయ్య, మాజీ ఎంపీపీ అనుముల ఏడుకొండల్, మాజీ సర్పంచులు అనుముల శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, రవి, మాజీ ఎంపీటీసీ వెంకన్న, సైదులు, వెంకట్‌రెడ్డి, వెంకటాచారి, రాజేశ్‌నాయక్, రాంబాబు, హరినాయక్, తిరుపతిరావు పాల్గొన్నారు.