ఆత్మకూర్.ఎస్, డిసెంబర్ 29 : రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఆత్మకుర్.ఎస్ బీసీ గురుకుల విద్యార్థులు స్తతా చాటారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సంక్షేమ విద్యాలయాల ఆధ్వర్యంలో కేశంపేట (షాద్ నగర్) లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో జూనియర్ విభాగం నుండి జానపద నృత్యంలో ముని, బాలచందర్, గణేశ్, చరణ్, మణి, ప్రసాద్, జగదీశ్, షర్వాన్, మధు పాల్గొని మొదటి బహుమతి సాధించారు. అదేవిధంగా సీనియర్ మిమిక్రీ విభాగంలో భరత్‌కుమార్ రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి సాధించాడు. అలాగే తూర్కపల్లి (శామీర్ పేట ) రాష్ట్ర స్థాయి క్రీడల్లో అండర్- 14 కబడ్డీ విభాగంలో మధు అనే విద్యార్థి మొదటి బహుమతి సాధించాడు. ప్రతిభ కనబరిచి మెడల్స్ గెలుపొందిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ జె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.