ఆత్మకూర్.ఎస్, జనవరి 01 : గత నెల 30, 31న రెండు రోజుల పాటు జరిగిన సూర్యాపేట జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శనలో సైన్స్ సుస్థిర వ్యవసాయం జూనియర్ విభాగంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల ఆత్మకూర్.ఎస్ విద్యార్థులు ధనుష్, హేమంత్ జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతులు పొంది రాష్ట్ర స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. వీరిని గురువారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జెల్లా వెంకటేశ్వర్లు, సైన్స్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
తుంగతుర్తి మండలం పసునూరు గ్రామానికి చెందిన నరాల జయరాజ్, సంతోష దంపతుల కుమారులు నిఖిల్ శ్రీ, టోని ఆత్మకూర్.ఎస్ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. గత నెల 31న నిఖిల్ శ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని మూడు వేల రూపాయల విలువ చేసే రెండు సీలింగ్ ఫ్యాన్లను పాఠశాలకు గురువారం వారు బహుకరించారు.

Atmakur.S : రాష్ట్ర స్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఆత్మకూర్.ఎస్ గురుకుల విద్యార్థులు ఎంపిక