అర్వపల్లి, నవంబర్ 28 : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే అర్వపల్లి శివారులోని హజ్రత్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రెండ్రోజులపాటే సాగే ఉర్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది భక్తులు తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్లో ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో పూజలు చేసి గంథాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకురానున్నారు.
అర్థరాత్రి ఖవ్వాలి నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం దీపారాధన ఉంటుంది. ఉర్సు సందర్భంగా దర్గాను విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు దర్గా నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ హుస్సేన్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లా వక్ప్ బోర్డు ఇన్సెక్టర్ షేక్ మహ్మద్ గురువారం ఏర్పాట్లను పరిశీలించాడు.