నీలగిరి, జూలై 28 : నల్లగొండ సెట్విన్ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ, ఉపాధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కో ఆర్డినేటర్ ఎం.సరిత సోమవారం ఒక ప్రకటనలో కోరారు. కంప్యూటర్ బేసిక్స్, డిటిపి, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్, బ్యూటీషియన్, డిప్లమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన యువత నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పక్కన గల సెట్విన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 97050 41789, 08682 281101 నంబర్లను సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.