పెద్దవూర, జూలై 16 : నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న స్వీపర్ పోస్టును కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నందున ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ తరి రాము బుధవారం తెలిపారు. పెద్దవూర మండలానికి చెందిన 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మహిళలు 7వ తరగతి పాస్ అయి ఉన్నవారు దరఖాస్తుకు అర్హులన్నారు. ఆధార్ కార్డు, 7వ తరగతి పాస్ మెమో, బయోడేటా ఫారం పూర్తి చేసి కేజీబీవీ పాఠశాలలో ఈ నెల 19వ తేదీ లోపు సమర్పించాలని పేర్కొన్నారు.