నీలగిరి, జూన్24 : నల్లగొండ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 26లోగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్దతిన పనిచేయుటకు ఎంబీబీఎస్ పూర్తిచేసి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరకాస్తు చేసుకున్న వారికి ఈ నెల 27న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో వాక్ ఇన్ ఇంటర్వ్యు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.