నిడమనూరు, జూన్ 20 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్ పోస్టులకు అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ బూరుగు నిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 21న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులతో పాటుగా ఒరిజినల్ ద్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. పోస్టులకు సంబంధించిన వివరాల కోసం 9010949936 మొబైల్ నెంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.