చందంపేట, ఆగస్టు 30 : నేరేడుగొమ్ము మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్లో మిగిలిన సీట్లకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ కొర్ర శిరీష తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. మోడల్ పాఠశాలలో 2025 -26లో 6వ తరగతి నుండి ఇంటర్ ఫస్టియర్ వరకు మిగిలిన సీట్ల భర్తీకి సెప్టెంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి తరగతిలో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వివరాలకు 9704216525 నంబర్‌కు కాల్ చేసి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.