నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), జూన్ 06 : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల -చర్లపల్లి, నల్లగొండలో 2025-26 సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పవిత్రవాణి కర్ష తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని మౌలిక వసతులతో, అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన ఉంటుందని తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థినులు అడ్మిషన్లకు దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోగా కళాశాలలో సమర్పించాలని సూచించారు.
బీఏ (హెచ్.ఈ.పి), బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో ఎం.పి.సి, ఎం.పి.సి.ఎస్, ఎంఎస్సిఎస్, ఎం.ఎస్.డి.ఎస్, బి.జెడ్.సి, ఎం.జెడ్.సి.
టెన్త్, ఇంటర్ మార్క్స్ మెమోలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోస్ దరఖాస్తుతో అందజేయాలి.
అడ్మిషన్లు ఇతర పూర్తి వివరాలకు కళాశాల పని వేళల్లో 9000229058, 8639109606 నంబర్లను సంప్రదించగలరు.