కట్టంగూర్(నకిరేకల్): నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన మహోత్సవం, నూత న కార్యవర్గ ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వరాల్గ ప్రజలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు.
పట్టణంలో సెంట్రల్ లైటింగ్‌కు 2.5 కోట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.8 కోట్ల వెచ్చించడం జరిగందన్నారు. గజ్వేల్ తరహాలో రూ.80లక్షలతో మోడల్ వైకుంఠధామం, కోటి రూపాయలతో మినీ ట్యాంకు బండ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.