
నల్లగొండ రూరల్: క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ తమ విధులలో మంచి ప్రతిభ కనబరస్తున్న మహిళా ఆరోగ్య కార్యకర్తలను గురువారం డీఎంహెచ్వో కార్యాలయ సమావేశం మందిరంలో డీఎంహెచ్వో కొండల్రావు ఆవార్డు, శాలువ, ప్రశంసా పత్రా లు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎఎన్ఎంలు 36 రకాల రిజిష్టర్లను మ్యానువ ల్గా రాసి , వాటిని తమ వెంట తీసుకెళ్లి ఇబ్బందులు పడ్డారన్నారు.
ప్రభుత్వం జిల్లాలో 421మందికి ట్యాబ్లు పంపిణీ చేసిందన్నారు. గత నెల 15లోగా ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలని గడువు కేటాయించగా 188 మంది ఏఎన్ఎంలు వంద శాతం నమోదు ప్రక్రియను పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా వారిని సత్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ , మిర్యాలగూడ, దేవరకొండల డిప్యూటీ డీఎంహెచ్వోలు డా.వే ణుగోపాల్రెడ్డి , కేశ రవి, కృష్ణకుమారి, ఉమ మహేశ్వరీ పాల్గొన్నారు.