-యాదాద్రి భువనగిరి, నవంబర్ 22
(నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ చిన్నారులకు ప్రభుత్వ ఉచిత యూనిఫామ్ పత్తాలేదు. డ్రెస్‌లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా ప్రభుత్వ తీరుతో అమలుకు నోచుకోవడం లేదు. తొలి విడుతలో భాగంగా 8,392 మంది చిన్నారులకు అందించకుండా తాత్సారం చేస్తున్నది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, అందుకే పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు సరార్ సూళ్లలో చదువుతున్న విద్యార్థులకే ఉచిత యూనిఫామ్ ఇస్తున్నది. ఇక నుంచి అంగన్వాడీ సూళ్లలో చదువుతున్న చిన్నారులకు కూడా యూనిఫామ్ కుట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మోతూరు, రామన్నపేట, ఆలేరు, భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్ వాడీ కేంద్రాలున్నాయి. వాటిల్లో 19,405 మంది చిన్నారులు నమోదయ్యారు. 414 అంగన్ వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలల ఆవరణల్లో ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ ఇస్తున్నదున వారితోపాటు అంగన్ వాడీ కేంద్రాల విద్యార్థులకు కూడా తొలుత యూనిఫామ్ అందించాలని భావించారు. మిగతావి రెండో దశలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకంలో తొలి విడుత 414 కేంద్రాల్లో 8,392 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది . ఇక సూర్యాపేటలో 8,575, నల్లగొండ జిల్లాలో 11,158 మంది చిన్నారులు ఉన్నారు.
చిన్నారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు రకాలు, డిజైన్లలో యూనిఫాంను ప్రభుత్వం ఎంపిక చేసింది. చిన్నారుల యూనిఫామ్‌కు సంబంధించి బాలురకు చొకా, నికరు, బాలికలకు గౌను డిజైన్ ఫైనల్ చేసింది. రెడ్, యాష్, బ్లూ, వైట్ నాలుగు రంగుల్లో క్లాత్‌ను ఎంపిక చేసింది. ఉమ్మడి జిల్లాలో 19,237 మీటర్ల రెడ్ క్లాత్, 19,237 మీటర్ల యాష్ , 10,398 మీటర్ల బ్లూ, 7,032 మీటర్ల వైట్ కలర్ క్లాత్ అవసరం పడుతుందని అంచనా వేశారు. జిల్లాకు టెసో ద్వారా క్లాత్‌ను సరఫరా చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ బడులు, అంగన్ వాడీలు ఎంతో అభివృద్ధి చెందాయి. ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. సరారు బడుల్లో మంచి విద్య అందుతున్నది. అయితే అంగన్ వాడీలను మరింత బలోపేతం చేయడానికి ఇప్పుడు యూనిఫామ్ కార్యక్రమం తీసుకొచ్చారు. ప్రభుత్వ విద్య, పాఠశాలలను ప్రోత్సహించడానికి అంగన్ వాడీలను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏకరూప దుస్తులతో తరగతులకు హాజరైతే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని, వారి మధ్య తారతమ్యాలు, కల్మషాలకు తావు ఉండదని పేరొంటున్నారు.
ప్రభుత్వం సూల్ విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్‌లో మహిళా సంఘాలకు ఇవ్వడంతో విజయవంతంగా పని పూర్తి చేశారు. దీంతో చిన్నారుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను సెర్ప్‌కు అప్పగించారు. మహిళా సంఘాల ద్వారా డ్రెస్‌లను కుట్టించారు. స్టిచ్చింగ్కు ఒకో బాలిక యూనిఫామ్ కు రూ.60, బాలుడికి రూ.80 చెల్లించారు. దీంతో మహిళలకు మరింత ఉపాధి లభించినట్లయ్యింది. అయితే పంపిణీకి డ్రెస్‌లు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి జూలైలోనే చిన్నారులకు అందించాల్సి ఉంది. కానీ నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పత్తాలేవు. ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
అంగన్ వాడీల్లో చిన్నారులకు యూనిఫామ్ మహిళా సంఘాల ద్వారా కుట్టిం చాం. డ్రెస్‌లు సిద్ధంగా ఉన్నాయి. ప్రభు త్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో పం పిణీ ఆలస్యం అవుతున్నది. త్వరలోనే చి న్నారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
– నర్సింహారావు, పీడీ, ఐసీడీఎస్