– భీమవరం పాఠశాలలో ఘనంగా అందెశ్రీ జయంతి
కేతేపల్లి, జూలై 18 : తెలంగాణ మట్టి పరిమళం అందెశ్రీ అని నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం పాఠశాల తెలుగు భాష ఉపాధ్యాయుడు రాపోలు పరమేష్ అన్నారు. శనివారం భీమవరంలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందెశ్రీ జీవితం తెలంగాణ సమాజానికి స్ఫూర్తి దాయకం అన్నారు. అతి సాధారణ పదాలతో అద్భుతమైన పాటలను రచించిన గొప్ప రచయిత అందెశ్రీ అని కొనియాడారు. నేటి తరం ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి జి.వెంకటేశ్వర్లు, జానకిరెడ్డి, గుండా రమేష్, శివయ్య, శ్రీధర్, శేఖర్, దొరిపలి నాగయ్య, అటెండర్ అహ్మద్ పాల్గొన్నారు.