మేళ్లచెర్వు, మే 15 : సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు జడ్పీహెచ్ఎస్ 2000-2001 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను చేసుకున్నారు. తాము విద్యనభ్యసించిన మండల కేంద్రంలోని పాఠశాల ప్రాంగణంలో 25 సంవత్సరాల తర్వాత అంతా కలిసి సందడి చేశారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ అప్యాయంగా పలుకరించుకున్నారు. తమకు చదువు చెప్పిన గురువులు సలీం, వెంకట నారాయణ, ఏడుకొండలు, చిన్నప్ప, వెంకట్రెడ్డిని శాలువాలు, పుష్పమాలలతో ఘనంగా సత్కరించి షీల్డ్ లు అందజేశారు. అనంతరం ఆట పాటలు, క్విజ్, అంత్యాక్షరీతో ఆనందంగా గడిపి మళ్లీ కలుద్దామంటూ ఒకరికొకరు వీడ్కోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పల్లేటి నాగార్జున, గణేశ్, నాగేశ్వర్రావు, వీరబాబు, సైదులు, రాధిక, పద్మ, శ్రీలక్మీ, భవాని, లక్ష్మీ, పుష్పలత, హైమావతి, సుల్తానాబేగం, చంద్రకళ, విజయకుమారి పాల్గొన్నారు.