నల్గొండ విద్యావిభాగం (రామగిరి), మార్చి 27 : విద్యా సంస్థలతో పాటు ఇతర కార్యాలయాల్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులంతా పీఎఫ్ లో చేరాలని నల్లగొండ జిల్లా పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎం.షబ్బీర్ అలీ అన్నారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రీజినల్ కార్యాలయం హైదరాబాద్ (బర్కత్‌పుర) ఆధ్వర్యంలో నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో గురువారం ”జిల్లా అవగాహన కార్యక్రమం నిధి ఆప్కె నికట్ 2.0 ” అంశంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పీఎఫ్ కార్యాలయంలో చెల్లించే ఈపీఎఫ్ ఈడిఎల్ఐల వివరాలను ఇతర అంశాలను సంపూర్ణంగా వివరించి అవగాహన కల్పించారు.
ఉద్యోగికి ఇచ్చే నెల వేతనంలో 12 శాతం ఉద్యోగి వాటా, 13 శాతం యాజమాన్యం వాటా మొత్తం 25 శాతం కలిపి ప్రతి నెల 15లోగా పీఎఫ్ చెల్లించాలన్నారు. యాజమాన్యాలు ఇబ్బందికి గురిచేస్తే పీఎఫ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. డీవీఎం విద్యాసంస్థల్లో పనిచేసే బోధన బోధన సిబ్బందికి రెగ్యులర్‌గా పిఎఫ్ చెల్లించడం అభినందనీయమన్నారు. పది సంవత్సరాలు గరిష్టంగా చెల్లించాలని 58 సంవత్సరాలు పూర్తికాగానే పీఎఫ్ కార్యాలయం నుంచి పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పిఎఫ్ చెల్లించే వారికి ప్రత్యేక బీమా సౌకర్యం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు నల్గొండలోని ఎల్పీటీ మార్కెట్లో గల జిల్లా పీఎఫ్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
డీవీఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ దొడ్డ శాంతికుమార్ మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థ ప్రారంభం నుంచి కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి పీఎఫ్‌ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల శ్రేయస్సు లక్ష్యంగా గత 40 సంవత్సరాలుగా నల్లగొండతో పాటు హైదరాబాద్‌లో విద్యాసంస్థలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్ కార్యాలయ సీనియర్ సెక్షన్ సెక్యూరిటీ అసిస్టెంట్ షేక్ నరసయ్య, డీవీఎం విద్యాసంస్థల సూపరింటెండెంట్ చోలేటి శ్రీధరాచారి, డీవీఎం విద్యాసంస్థల (బీఈడీ, ఎంఈడీ, డీఈడి, ఎంబీఏ) ప్రిన్సిపాల్స్ బోళ్ల నారాయణరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ, ఎన్.శ్రీదేవి, జె.పుష్పాంజలి, సీనియర్ అధ్యాపకులు ఆర్.సత్యనారాయణ, అధ్యాపకులు ఏ.సరిత ఎం.రవి, శ్వేత, అజితారాణి, రోజా, లైబ్రేరియన్ వెంకటేశ్వర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విజయలక్ష్మి పి.శ్రీధర్ రెడ్డి, బి.వీరప్ప, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.