ఆలేరు రూరల్, నవంబర్ 6 : కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలకు మోసపోయి గోస పడొద్దని ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. అన్నారు. సోమవారం మండలంలోని కందిగడ్డతండా, మందనపల్లి, టంగుటూరు, శారాజీపేట, గొలనుకొండ, తూర్పుగూడెం, మంతపురిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న ఆడబిడ్డలందరికీ సౌభాగ్య పథకం కింద రూ.3 వేలు, ఆసరా పింఛన్ రూ.5,016, దివ్యాంగుల పింఛన్ రూ.6,016 అందజేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి కర్ణాటక రాష్ట్ర పరిస్థితిని తెచ్చుకోవద్దన్నారు. అభివృద్ధే ఎజెండాగా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి మరోసారి సంపూర్ణ మద్దతు తెలుపాలని కోరారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రైతులను ఆనందపరుస్తున్న గొప్పనాయకుడు అని కొనియాడారు. అర్హులైన ప్రతి దళిత, బీసీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమం అందని కుల సంఘాలు లేవన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశంగౌడ్, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ రచ్చ రాంనర్సయ్య, వైస్ ఎంపీపీ గాజుల లావణ్యావెంకటేశ్యాదవ్, మాజీ ఎంపీపీ కాసగల్ల అనసూయ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, ఎంపీటీసీ జూకంటి అనూరాధఅనిల్, సర్పంచ్‌లు బండ పద్మాపర్వతాలు, కోటగిరి జయమ్మ, కోటగిరి పాండరి, వంగాల శ్రీశైలం, లక్ష్మి, కేతావత్ సుజాత, బక్క రాంప్రసాద్, ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరుకొప్పుల కిష్టయ్య, మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జనగాం వెంకటపాపిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట : అమ్మ గెలుపు కోసం కూతుళ్లు నడుం బిగించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గెలుపు కోరుతూ ఆమె కూతుళ్లు గొంగిడి అంజని, హర్షిత సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గౌరాయిపల్లిలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని అనంతరం ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని అభర్థించారు. జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జిన్నా మాధవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రాజాపేట : గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి గెలుపు కోరుతూ సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బెడిదె వీరేశం, మహేంద్ర యువసేన మండలాధ్యక్షుడు బిల్లకుదురు రాజు, నాయకులు సట్టు తిరుమలేశ్, జశ్వంత్, మహేశ్ పాల్గొన్నారు.
మోటకొండూర్ : మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్తో అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ, మాజీ సెక్రటరీ జనరల్ సిరబోయిన నర్సింగ్‌యాదవ్, మాజీ ఉప సర్పంచ్ బొట్ల నర్సింహ, బీసీ సెల్ మండలాధ్యక్షుడు మల్గ గౌరయ్య, ఉపాధ్యక్షుడు గంగాధర్, యూత్ ప్రధాన కార్యదర్శి దడిగె మధు, నాయకులు గంధమల్ల మధు, బొట్ల మహేశ్, బొట్ల ప్రశాంత్, నల్ల జహంగీర్, కాదూరి ఏలేందర్, బొట్ల నవీన్, కొల్లూరి నరేశ్, బుచ్చిరెడ్డి, భిక్షపతి, విజయ్, బాలకృష్ణ, నరేశ్, రాజు, సురేశ్ పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) : గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ బైక్‌ర్యాలీ బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అలాగే సోమవారం మండల కేంద్రంతోపాటు పల్లెపల్లెనా బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చందర్‌గౌడ్, ఎంపీటీసీ కవిత, గ్రామశాఖ అధ్యక్షుడు వెంకన్న, నాయకులు పూర్ణచందర్‌రాజు,ఇంద్రారెడ్డి, హేమలత, అరుణ, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, రాజు, అజీమొద్దీన్ పాల్గొన్నారు.