నల్లగొండ, డిసెంబర్ 15 : నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా అయితగోని మధు గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందాడు. 26 సంవత్సరాల వయసులోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా చాటాడు. కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవలు అందిస్తున్న మధు గౌడ్‌కు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు. గ్రామ ప్రజలు మధు పట్టుదలను, ప్రజల కష్టసుఖాలను పంచుకోవడంలో, సమస్యలను పరిష్కరించడంలో మొదటి నుండి ముందుండడంతో గ్రామ ప్రజలు మధుకు పట్టం కట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను మట్టికరిపించి 439 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించాడు. చిన్న వయసులోనే మధు గెలుపొందడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని రానున్న రోజుల్లో లీడర్‌గా ఎదిగేందుకు ఈ ఎన్నిక ఎంతో ఉపయోగపడిందన్నారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మధు తెలిపారు.