రామగిరి, మార్చి 20 : నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయంలో బాలవాటిక 3, తరగతి 1లో అడ్మిషన్లకై అర్హులు శుక్రవారం నుండి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని నల్లగొండ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. https:/admission kvs gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 2లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదేవిధంగా 2వ తరగతి నుండి 9 వతరగతి వరకు అడ్మిషన్లకై దరఖాస్తుల ప్రక్రియ మార్చి 31 తర్వాత ప్రారంభం అవుతుందని, ఖాళీల ప్రకారం దరఖాస్తులను కేవీ స్కూల్లో ఏప్రిల్ 2 నుండి 8వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు https://kvsangathan.nic.in/en/admission సంప్రదించవచ్చని వెల్లడించారు. అదే విధంగా 2026-27 విద్యా సంవత్సవరం ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ సీబీఎస్ఈ తరగతి 10వ తరగతి ఫలితాల తర్వాత మాత్రమే దరఖాస్తులు ఇవ్వబడతాయని తెలిపారు.