హాలియా/తిరుమలగిరి(సాగర్), ఫిబ్రవరి 27 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసే ఇతర పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. తిరుమలగిరి సాగర్ మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సోమవారం హాలియా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. అందుకే దేశం మొత్తం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
పార్టీలో చేరిన వారిలో మత్స్యకార్మిక సంఘం అధ్యక్షుడు ఈదుల నారాయణ, వైస్ చైర్మన్ ముండాది నాగయ్య, బొజ్జ హుస్సేన్, రామయ్యతో పాటు 50 కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ గుండాల రవి, సర్పంచ్ భిక్షానాయక్, ఎంపీటీసీ పెద్దమాము కాశయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, బూడిద హరికృష్ణ, పగడాల నాగరాజు, సర్పంచులు జఠావత్ దేవుడు, కిషన్‌నాయక్, శంకర్‌నాయక్, రాంసింగ్‌నాయక్, రమావత్ రవినాయక్, నాయకులు కొండల్, జూర్ల కోటయ్య, కాశయ్య, గుండాల నాగరాజు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
గుర్రంపోడు : మండంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. 14,45,500 విలువైన చెక్కులను హాలియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో బొల్లారం సర్పంచ్ కామళ్ల రేవదా నర్సింహ, ఎంపీటీసీలు దోటి చంద్రమౌళి, గట్టుపల్లి శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పూల సహదేవ్, నాయకులు కామళ్ల రాములు, వెలుగు శంకర్, నిమ్మల రామలింగం, శివర్ల శ్రీను, నగేశ్, వెంకటయ్య పాల్గొన్నారు.