పట్టభద్రుల ఓటు నమోదుకు మరో చాన్స్
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదుకు మరో అవకాశం ఉన్నదని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ డీఈఓ భాసర్రావు తెలిపారు.
- అర్హులు దరఖాస్తు చేసుకోవాలి : అదనపు కలెక్టర్ భాసర్రావు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఓటరు నమోదుకు మరో అవకాశం ఉన్నదని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), డిప్యూటీ డీఈఓ భాసర్రావు తెలిపారు. ఓటు హకు నమోదు కోసం ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 24న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు పేరొన్నారు. ఈ నెల 6 తర్వాత, 14 వరకు సమర్పించిన దరఖాస్తులన్నీ క్లెయిమ్ల వ్యవధిలో పరిషరించనున్నట్లు వివరించారు. క్లెయిమ్లు, అభ్యంతరాల గడువు మార్చి 14తో ముగుస్తుందని తెలిపారు.
ప్రస్తుత నమోదుకు అర్హత తేదీ నవంబర్ ఒకటి తెలిపారు. వ్యక్తిగతంగా గానీ, పోస్ట్ ద్వారా గానీ పెద్ద మొత్తంలో సమర్పించిన దరఖాస్తులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిగణనలోకి తీసుకోరని పేర్కొన్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు తమ అర్హత గల ఉద్యోగులందరి దరఖాస్తులను కలిపి పంపించవచ్చని వివరించారు. ఒక వ్యక్తి తన కుటుంబంలోని అర్హతగల సభ్యుల ఫారాలను కూడా సమర్పించవచ్చని తెలిపారు. ఏదైనా సందేహం ఉంటే ఈఆర్వో లేదా ఏఈఆర్వోను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

