దేవరకొండ రూరల్, ఆగస్టు 20 : దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని దేవరకొండ, కొండామల్లేపల్లి పట్టణ కేంద్రాల్లో అనుమతి లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్ గౌడ్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు విద్యను వ్యాపారంగా మార్చి, అనుమతులు లేకుండా వేలకు వేల ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్ సెంటర్లను, ప్రైవేట్ హాస్టల్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు తోటపల్లి మల్లేశ్, బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం దేవరకొండ మండల అధ్యక్షుడు పోతురాజు ధనరాజ్ యాదవ్, బీసీ పొలిటికల్ జేఏసీ దేవరకొండ మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి సత్యం, బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం డిండి మండల కార్యదర్శి కుంభం సిద్ధూ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ విద్యార్థి చందంపేట మండల అధ్యక్షుడు పచ్చిపాల మహేశ్ యాదవ్, చింతపల్లి గోపి గౌడ్, గొడుగు శివ యాదవ్ పాల్గొన్నారు,