నల్లగొండ సిటీ, జూన్ 19: అక్రమంగా తమ వ్యవసాయ భూమిలో రాత్రి సమయంలో రాళ్లు పోసిన వారిపై చట్యారీత్యా చర్యలు తీసుకోవాలని కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఉడతల పార్వతమ్మ,యాదగిరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..
కనగల్ మండలం రేగట్టె రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 142,158 సర్వే నెంబర్లో తమకు వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిని 1975 నుంచి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. కొన్నేండ్ల క్రితం పక్క భూమి యజమాని గుంటకాడి ఈదయ్య తన వ్యవసాయ భూమిని ఈరమ్మయాదగిరికి విక్రయించడానికి నిర్ణయించుకున్నాడు.
వారి భూమికి దారి లేకపోవడంతో తమ భూమిలో దారికి కొంత ఇవ్వాలని కోరారు. దారికి ఇచ్చిన భూమికి బదులు వేరే ప్రాంతంలో భూమి ఇస్తానని నమ్మబలికి యాదగిరికి భూమిని విక్రయించాడు. కానీ తమకు వేరే ప్రాంతంలో ఇస్తామన్న భూమి ఇవ్వకపోవడంతోపాటు భూమి కొనుగోలు చేసిన యాదగిరి రాత్రి సమయంలో తమ వ్యవసాయ భూమిలో రాళ్లు పోస్తున్నారు. ఇది సరైందికైని అగితే తమపై దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వృద్ధదంపతులు కోరారు.