రామగిరి, ఆగస్టు 14: నల్లగొండ మాన్యంచెలలోని హైదర్‌ఖాన్‌గూడలో 2013 ఏప్రిల్ 28న 11 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, చున్నీతో ఉరి వేసి చంపి మురికి కాల్వలో పడేసిన కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు రెండో అదనపు జిల్లా జడ్జి రోజారమణి మరణ శిక్ష విధించారు. అప్ప ట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర కు, నల్లగొండ వన్‌టౌన్ పోలీసు లు కేసు నమోదు చేశారు.
తీర్పు లో భాగంగా మర్డర్ కేసులో మరణశిక్ష, అలాగే పోక్సో కేసులో మరణశిక్ష (డబుల్ డెత్ పెనాల్టీ ), అండ్ రూ. లక్షా పదివేల జరిమానా విధించడమే కాకుం డా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం ద్రపవార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సేకరించి నిందితునికి శిక్ష పడేలా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డీఎస్పీ విజయ కుమార్, అలాగే ప్రాసిక్యూషన్‌కు సహకరించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, వన్ టౌన్ సీఐ వేమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై గుత్తా వెంకట్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కందుగుల శ్రీవా ణి, దామోదరం శ్రీవాణి, వేముల రంజిత్ కుమార్, సీడీవోఎస్ వెంకటేశ్వర్లు, రాం బాబు, లయజన్ అధికారులు, నరేందర్, మల్లికార్జున్‌ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. నిందితునికి మరణశిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, మృతురాలి కు టుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.