సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 20: సూ ర్యాపేటలో వృద్ధురాలి హత్య, చోరీ కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధిం చి వివరాలు ఇలా మిర్యాలగూడెం పట్టణానికి చెందిన సైదాచారి (48) ఏడాది కిందట కుటుంబంతో సూర్యాపేటకు వచ్చి పట్టణంలోని జేజే నగర్లో నివసిస్తున్నాడు. నిత్యం మద్యం సేవించి వేధిస్తుండటంతో భార్య మూ డు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది.
అదే వీధిలో ఒంటరిగా ఉం టున్న వృద్ధ మహిళ ఇరుగు పాపమ్మ (85)తో పరిచయం పెంచుకున్న సైదాచారి ఈ నెల 18న ఆమెను హత్య చేసి, 3 తులాల బంగారంతో ఉడాయించాడు. దొంగిలించిన బంగారు నగలను మిర్యాలగూడంలో కుదువపెట్టి ఏపీలోని ఏలూరుకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితు డి ఆచూకీ తెలుసుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు సైదాచారిని ఏలూరులో అదుపులోకి తీసుకుని ఆదివా రం రాత్రి సూర్యాపేటకు తరలిస్తుండగా కోదాడ సమీపంలో అస్వస్థతకు గురయ్యాడు.
పోలీసులు వెంటనే నిం దితుడిని కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దవాఖానలో చికి త్స పొందుతున్న సైదాచారి ఆదివారం అర్థరాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మాత్రం మృతుడికి గతంలో బైపాస్ సర్జరీ జరిగిందని, గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు చెబుతున్నారు. కాగా నిందితుడి మృతి కేసు లో వివరాలను గోప్యంగా ఉంచడం, పోస్టుమార్టం గది వద్దకు మీడియాను అనుమతించకపోవడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.