మిర్యాలగూడ, మే 29: పెట్రోల్ బంక్‌లే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతూ డబ్బులను దోచుకుంటున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 11న నాగార్జునసాగర్‌లోని పైలాన్ కాలనీలో హైవే పక్కన గల భారత్ పెట్రోల్ బంక్‌లోకి ఒక వ్యక్తి వెళ్లి అక్కడ పనిచేసే పంప్ బాయ్‌తో తన బావకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అత్యవసరమని చెప్పి కర్ణాటక బ్యాంక్‌కు చెందిన ఏటీఎం డెబిట్‌కార్డు ఇచ్చి మొదటిసారి స్వైపింగ్ మిషిన్‌లో స్వైప్ చేసి రూ.35,350 తీసుకుని వెంటనే రెండవసారి స్వైప్ చేసి రూ.30,250 తీసుకున్నాడు.
పంప్ బాయ్ లంచ్‌కు వెళ్లే సమయంలో బిజీగా ఉన్నది చూసి స్వైపింగ్ మిషిన్‌ను దొంగతనంగా తీసుకొని తన డబ్బులను వాయిడ్ అనే యాప్ ద్వారా తిరిగి తన అకౌంట్లోకి రిటర్న్ చేసుకున్నాడు. అతను వెళ్లిన అనంతరం డబ్బులు తేడా రావడంతో ఈనెల 16న బ్యాంక్‌కు వెళ్లి చెక్ చేసుకోగా డెబిట్ కార్డు ద్వారా స్వైప్ చేసిన డబ్బులు తిరిగి అతని అకౌంట్‌కు వెళ్లినట్లు తెలిసిందని బంక్ యజమాని బొమ్మిరెడ్డి బ్రహ్మారెడ్డి విజయపురి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం పైలాన్ కాలనీలో పోలీసులు నేర పరిశోధనలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా సాగర్ బార్డర్ చెక్‌పోస్టు వద్ద బైక్‌పై ఒక వ్యక్తి పోలీసులను చూసి వెనుకకు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకుని విచారించారు. తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం, రావిపాడు గ్రామమని తన పేరు అనాల శివ అని తాను చేసిన నేరాల లిస్ట్‌ను పోలీసులకు తెలిపాడు. ఇదేవిధంగా 33 పెట్రోల్బంక్లల్లో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
ఇటీవల కాలంలో విజయపురి టౌన్, సూర్యాపేట రూరల్, మునగాల, జగ్గయ్యపేట(ఆంధ్ర), మేడికొండూరు (ఆంధ్ర), జి. కొండూరు(ఆంధ్ర)లతోపాటు బాపట్ల, గుంటూ రు, విజయవాడ, పెడన, గుడివాడ, నాగులపాడు, ఒంగోలు, వినుకొండ, ఎడ్లపాడు, చౌడవరం, పురిచేడు, దర్శి, పిడుగురాళ్ల, తెనాలి, కందుకూరు, పొదిలి, గిద్దలూరులో నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. మోసాలకు పాల్పడుతున్న ఇతనికి స్పెషల్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నేరస్తుడి నుంచి రూ. 2లక్షల నగదు, గ్లామర్ బైక్, ఆరు ఏటీఎం కార్డులు, ఒక మొబైల్ స్వాధీనం చేసుకుని రిమాండ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనూనాయక్, ఎస్ఐ సంపత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.