నల్లగొండ, జనవరి 20 : నల్లగొండ పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుండి అన్ని క్రతువులను పూర్తి చేసి, హోమం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, ఎడ్ల శంకర్, గుండెబోయిన వెంకన్న యాదవ్, కమిటీ అధ్యక్షుడు భైరగోని రాజయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్, ఉపాధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్, ఇటీకాల కృష్ణయ్య, గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రాంరెడ్డి, బొడ్డుపల్లి సతీష్, నాళ్ల వెంకన్న, బిజెపి నాయకులు నరాల శంకర్, కాశమ్మ, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.

Nalgonda : అభయాంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం