రాజాపేట : నల్గొండ జిల్లా రాజాపేట (Rajapeta) మండలంలో ఓ యువకుడు ఆలయానికి వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road accident ) మృతి చెందాడు. మండలంలోని జాల గ్రామానికి చెందిన చెవిటి ప్రభాకర్ (32) రాత్రి తనపై బైక్ పై జాల మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించ పోయి అదుపు తప్పి రోడ్డు మీద పడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సంతోష ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.