నల్లగొండ, ఆగస్టు 20: ఆన్లైన్లో ఇసుక బుక్ చేసి డ్రైవర్‌కు అమ్ముకునేది బ్రోకర్…దాన్ని రీచ్ దాటించి అంతకు మించిన ధరతో అమ్ముకునేది ట్రాక్టర్ డ్రైవర్… ఆ ట్రాక్టర్ రీచ్ నుంచి బయటకు వెళ్లేందుకు సహకరించేది ఎస్ఆర్వో.. ఎక్కడా పట్టుబడకుండా చూసేది గ్రామ పోలీసు అధికారి..ఇలా తలా ఒక పొజీషన్లో ఉండి ఎవరికి వారే ఒక రేటు నిర్ణయించి ఇసుక సరఫరా చేస్తున్న నేపథ్యంలో వినియోగ దారుడికి ట్రిప్పుకు రూ.2920లకు దక్కాల్సిన ఇసుకకు రూ.4వేల దాక చెల్లించాల్సి వస్తోంది.
నల్లగొండ జిల్లాలో ఇసుక దందా జోరుగా నడుస్తోంది. ఈ దందా వల్ల ఆన్లైన్లో ఇసుకను కొనాల్సిన వారికి సరైన ధర లభించకపోవడం, లభించినా సరైన సమయానికి రాకపోవటంతో ఆఫ్‌లైన్ ఇసుక కోసం వెతికి అంతకు మించి ధర పెట్టాల్సి వస్తుంది. జిల్లాలో మైనిం గ్ శాఖ 23 రీచ్‌లను గుర్తించగా ఆయా రీచ్‌ల్లో ఒక్కో మైనింగ్ శాఖ నుంచి ఒక్కో ఎస్ఆర్వో ఉన్నప్పటికీ వారి అండదండలతోపాటు గ్రా మాల పోలీసు అధికారుల సహకారంతో ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
ట్రిప్పు ట్రిప్పుకూ ఒక రేటు..
జిల్లా వ్యాప్తంగా మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో 23 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఈ రీచ్‌ల్లో సం బంధిత శాఖకు చెందిన ఎస్ఆర్వో కనుసన్నల్లోనే ఇసుక బండ్లు కదులుతాయి. అయితే ఆన్లైన్లో బుక్ చేసిన వారికి క్వాలిటీ లెస్ ఇసుకు సరఫరా చేస్తున్న డ్రైవర్లు ఆఫ్‌లైన్‌లో విక్రయించేదాన్ని మాత్రం క్వాలిటీతో విక్రయిస్తున్నారు. అయితే ఆన్లైన్లో బుక్ చేసిన వారు తప్పనిసరిగా కావాలని అంటే మాత్రం క్వాలిటీ లెస్ అది కూడా కొన్నిసార్లు బండ్లు మార్చి విక్రయిస్తున్నారు.
అదేమని వినియోగదారుడు ప్రశ్నిస్తే బండి మధ్యలో రిపేర్ అయిందనే సమాధానం ఇస్తున్నారు. ఇక ఆన్లైన్లో వినియోగదారులతోపాటు డ్రైవర్లు, బ్రోకర్లు సైతం బుక్ చేస్తుండగా డ్రైవర్లయితే నేరు గా.. బ్రోకర్లు బుక్ చేసింది అయితే ట్రిప్పుకు రూ.200 ఇచ్చి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రధాన పట్టణ కేంద్రాల్లో బహిరంగంగానే పెట్టి విక్రయించటం విశేషం. ప్రధానంగా నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో రోడ్డుమీద పెట్టి వేలం వేసి మరీ విక్రయిస్తున్నారు.
నిత్యం వేలల్లో సంపాదన..
ప్రతి ఇసుక రీచ్‌లో కొంతమంది ఆన్లైన్ ఇసుక బుకింగ్ చేయటంతోపాటు దాన్ని అదే డ్రైవర్లకు అమ్మేందుకు బ్రోకరిజం చేస్తుంటా రు. జిల్లాలో ఉన్న రీచ్‌ల్లో సుమారు 200 మం ది దాక బ్రోకర్లు ఉన్నట్లు తెలిసింది. వీరు ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా నిత్యం వేలల్లో సంపాదిస్తున్నారు.. ప్రతిరోజూ ఏదో ఒక పేరు తో ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తారు. వాళ్లకు ట్రాక్టర్ డ్రైవర్లు ఫోన్ చేయగానే మీరే అమ్ముకోండి.. కానీ ఏం ఇస్తావంటూ అడిగి ట్రిప్పుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రాం తాల్లో డైవర్లే ఈ పనిచేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో బ్రోకర్లు ఆ పని చేస్తున్నారు.
బ్రిడ్జీలు, కత్వల దగ్గర ఇసుక తవ్వకాలు..
బ్రిడ్జీలు, కత్వల వద్ద 500 మీటర్ల దాటిన తర్వాతే ఇసుకు తవ్వాలని..అంతకు ముందు తవ్వవద్దనే నిబంధన మైనింగ్‌లో ఉన్నది. ఎం దుకంటే దాని వల్ల ఆయా బ్రిడ్జీలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిబంధన పెట్టింది. అయితే కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు జేసీబీలతో తవ్వుతున్నప్పటికీ పోలీసులు, ఆర్అండ్బీ, మైనింగ్ శాఖ అధికారు లు మాత్రం పట్టించుకోవటం లేదు.
ప్రధానం గా కనగల్ బ్రిడ్జితోపాటు బోయినపల్లి బ్రిడ్జి వద్ద 50 మీటర్ల వరకు కూడా ఇసుక తవ్వకాలు చేపడుతుండటంతో సంబంధిత గ్రామ ప్రజలు ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై ఎన్నిసార్లు కాల్ చేసినా రిైప్లె ఇవ్వలేదని.. మై నింగ్ ఏడీ, డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఉపయో గం లేకుండా పోయిందని గ్రామస్తులు నమస్తే తెలంగాణకు తెలిపారు.
ఎస్ఆర్వో, వీపీవోలదే కీలక పాత్ర..
గుర్తించిన ఇసుక రీచ్‌ల్లో మైనింగ్ శాఖ నుంచి ఎస్ఆర్వో, పోలీస్ శాఖ నుంచి వీపీవోలు అక్రమాలు ఆపాలన్నా..నడిపించాలన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.అయితే మైనింగ్, పోలీసు అధికారులు మాత్రం వారికి నచ్చిన వారికి, లేకపోతే తాము చెబితే వినే వారికి మాత్రమే ఆ రీచ్‌లు ఉన్న గ్రామాల బాధ్యత అప్పగించటం విశేషం. వారు ట్రిప్పు ట్రిప్పుకూ లెక్కలేసి ప్రతి నెలా లక్షల్లో వసూలు చేసి తమ బాస్‌లకు అందచేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
అదీనూ ఆన్లైన్లో బుక్ చేసిన బండ్లకే.. ఇక ఆఫ్‌లైన్‌లో రాత్రి పూట.. లేదంటే ఇతర సెలవు దినాల్లో ఇసుక తరలిస్తూ దొరికితే ట్రాక్టర్ డ్రైవర్ జేబుకు చిల్లే. అంతేకాకుండా సమయంకానీ సమయాల్లో ఇసుక ఎత్తే జేసీబీలు దొరికితే రూ.25వేల నుంచి రూ.50వేల డీడీతో పాటు రూ.2లక్షల వరకు అడ్వాన్స్ చెల్లించాలని వేధిస్తున్నారట. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఏదైనా చెప్పే చేయాలని.. ప్రతి దానికి ఒక రేటు ఉంటుందని, ఇరు శాఖల అధికారులు కూడబలుక్కోని చెబుతున్నారని పలువురు డ్రైవర్లు అంటున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం..
ఆన్లైన్లో ఇసుక బుక్ చేస్తే క్వాలిటీ లేకపోతే ఫిర్యాదు చేస్తే తిరిగి క్వాలిటీ ఉన్న ఇసుక పంపిస్తాం. బండ్లు మార్చి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రీచ్‌ల్లో 500 మీటర్ల దాటిన తర్వాతనే ఇసుక తవ్వాలి తప్ప అంతకు ముందు తీస్తే చర్య లు తీసుకుంటాం. ఇక ఎస్ఆర్వోలు డబ్బు లు తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. ఇసుక బుకింగ్ విషయంలో ఏదైనా సమస్య ఉంటే మైనింగ్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలి.
-జాకబ్, మైనింగ్ శాఖ ఏడీ, నల్లగొండ