కట్టంగూర్, అక్టోబర్ 15 : సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురమర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాలు ఎంపీటీసీ బీరెల్లి రాజ్యలక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నార్కట్‌పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. గత తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ను మూడోసారి ఆశ్వీరదించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో నర్సింగ్ లింగయ్య, ఇంద్రకంటి సైదులు, ఇంద్రకంటి లవకుమార్, ఇంద్రకంటి అంజయ్య, కన్నయ్య, సతీశ్, జానపాటి యాదయ్య, సిరికొండ లింగయ్య, కొంపల్లి రామకృష్ణ, రాములు, మైలా వీరయ్య, మారయ్య, రాజు, నర్సింహ, యల్లయ్య, వాడపల్లి రమేశ్, మాదగోని నాగరాజు, చల్లా సతీశ్ ఉన్నారు. కార్యక్రమంలో చల్లా శ్రీను, తులసయ్య, నర్సింగ్ రమేశ్, శంకర్, ఇంద్రకంటి కుమార్ పాల్గొన్నారు.
రామన్నపేట : అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే సబ్బండ వర్గాలు మద్దతు పలుకుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం మండలంలోని జనంపల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు 100 మంది నార్కట్‌పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుదన్నారు.
పార్టీలో చేరిన వారిలో మాండ్ర ఉపేందర్, మేడబోయిన మహేశ్, సింగం సైదులు, బైరు శివ, నక్క రుక్కయ్య, జిల్లా శ్రీకాంత్, సంగిశెట్టి శివాజీ, నడిగోటి అంజయ్య, మేడబోయిన వెంకన్న, లింగస్వామి, గట్టు శ్యాం, నరేశ్, వరికుప్పల సతీశ్, వంగాల మత్స్యగిరి, నవీన్, గట్టు చందు, రవి, నూకల దేవేందర్, మేడబోయిన నరేశ్, బన్నీ, అక్బర్, అనిల్, బాతుక రవి, నక్క రాంనర్సయ్య, గట్టు మహేశ్, గొలుసుల శ్రీను, అరవింద్, వరికుప్పల సురేందర్, శ్రీకాంత్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, సర్పంచ్ రేఖ యాదయ్య, ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు, గ్రామశాఖ అధ్యక్షుడు బండ దామోదర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ ఉపేందర్‌రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నక్క యాదయ్య, నడిగోటి కృష్ణ, వార్డు సభ్యులు పోశబోయిన నర్సింహ, సంగిశెట్టి నారాయణ పాల్గొన్నారు.