నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 30 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో శుక్రవారం 32 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడగా డీబార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
ఉదయం జరిగిన 4వ సెమిస్టర్ పరీక్షలకు 6,148 మంది విద్యార్థులకు 5,632 మంది హాజరు కాగా 492 గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలో 24 మంది డీబార్ కాగా నల్లగొండలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, దేవరకొండ భవిత డిగ్రీ కళాశాలలో ముగ్గురు, భారతి డిగ్రీ కళాశాలలో నలుగురు, మాల్ లోని శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ముగ్గురు, మిర్యాలగూడలోని విజేత డిగ్రీ కళాశాలలో ఒక్కరు, సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఇద్దరు, స్పందన డిగ్రీ కళాశాలలో ముగ్గురు, రాకేశ్ బీఈడీ కళాశాలలో ఇద్దరు, భువనగిరిలోని ఎస్ ఎల్ ఎస్ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు డీబార్ అయ్యారు.
మధ్యాహ్నం జరిగిన ఐదో సెమిస్టర్ పరీక్షలకు 1,524 మంది హాజరు కావాల్సి ఉండగా 1,324 మంది విద్యార్థులు హాజరయ్యారు. 192 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 8 మంది విద్యార్థులు డీబార్ కాగా రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నల్లగొండలోని సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, నీలగిరి డిగ్రీ కళాశాలలో ఒక్కరు, డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఒక్కరు, చౌటుప్పల్ లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఒక్కరు, సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఒక్కరు, మిర్యాలగూడలోని విజేత డిగ్రీ కళాశాలలో ఓ విద్యార్థి డీబార్ అయినట్లు తెలిపారు.