పెన్‌పహాడ్, జూలై 10: ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలనే సంకల్పంతో పెన్‌పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆకర్షణీయమైన ప్రోత్సహకాలను ప్రకటిస్తూ సర్పంచ్ నిరంజన్‌రెడ్డి ముందుకొచ్చారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌కు అదనంగా నెలకు 25 కిలోల బియ్యం, ఒక రైస్ కుక్కర్, విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, ఇతర సా మగ్రి అందజేస్తామని ప్రకటించారు.
అదే పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి నూతన సైకిల్ బహుమతిగా అం దిస్తామన్నారు. ఇటీవల అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాఠశాల మూసివేత ప్రమాదం నె లకొన్న నేపథ్యంలో ప్రభుత్వ బడిని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు వి శ్వాసం ఉంచి తమ పిల్లలను ఈ విద్యా సం వత్సరంలో తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ఉప సర్పంచ్ రాయి రమేశ్, వార్డు సభ్యులు కొండ గోవర్ధన్, మామిడి జానమ్మ, కందుకూరి నరేశ్, గోలి చినలింగయ్య, మీసాల జ్యోతి, ఒగ్గు రేణుక, కందుకూరి బక్కమ్మ, పాలకవర్గం సభ్యులు మద్దతు ప్రకటించారు.