నిత్యం వార్తల్లో నిలిచే తార.. తాప్సీ పన్ను. రెండేండ్ల విరామం తర్వాత, తెలుగులో తాను నటిస్తున్న చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకొంది తాప్సీ. పర్యావరణ పరిరక్షణ విషయంలో తన ఆలోచనలను, భావాలను ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్రం ద్వారా ప్రచారం చేయాలన్నది ఆమె ఆలోచన. ఈ సినిమాలో చివరివరకూ రీసైకిల్ చేసిన వస్త్రం నుంచి తయారయ్యే దుస్తులనే వాడాలని నిర్ణయించుకొంది. ‘షూట్ సమయంలో మనం ఉపయోగించే చాలా దుస్తులు వృథా అవుతుంటాయి. వాటిని పెట్టెల్లో దాచి.. చివరికి పడేస్తుంటారు. ఈ పద్ధతి నన్ను చాలా బాధించింది. అతికొద్దిమంది నిర్మాతలు మాత్రమే రీసైక్లింగ్ గురించి ఆలోచిస్తారు. అందుకే నేను, నా తదుపరి సినిమాకు రీసైకిల్డ్ ఫ్యాబ్రిక్‌నే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో ఇదే పద్ధతిని కొనసాగిస్తా. నటీ నటులు, చిత్ర నిర్మాతలు వృథాను నివారించాలి. పర్యావరణానికి నష్టం కలిగించ
కూడదు. సెట్స్‌ను శుభ్రంగా ఉంచడం కూడా చాలా కీలకం’ అని తన మనసులోని మాట చెప్పింది తాప్సీ.