సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Feb 05, 2021 , 01:30:46

నవశకానికి నాంది

నవశకానికి నాంది

  • రైతు వేదికలతో రైతుల సంఘటితం
  • నెరవేరుతున్న సీఎం కేసీఆర్‌ లక్ష్యం 
  • సాగులో మెళకువలు నేర్చుకోవాలి
  • తిప్పర్తి రైతు సదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి
  • మూడున్నర గంటలకు పైగా ముఖాముఖి

రైతు వేదికల నిర్మాణం వ్యవసాయ రంగంలో నవ శకానికి నాంది అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతులను సంఘటిత పర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం నేడు నెరవేరుతున్నదని చెప్పారు. నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు తిప్పర్తి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మూడున్నర గంటలకుపైగా రైతులతో ముఖాముఖి సంభాషించారు. ఆదర్శ రైతుల విజయ గాథలు విన్నారు. సాగులో స్వీయ అనుభవాలను వివరించి ఉత్సాహం నింపారు.

తిప్పర్తి, ఫిబ్రవరి 4 : రైతులు మార్కెట్లల్లో ధర ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందాలని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. నూతన సాగు పద్ధతులపై మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం క్లస్టర్‌ పరిధిలోని రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారు పండించిన పంటలు ఏ విధంగా ఉన్నాయో, దిగుబడి ఏవిధంగా సాధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభాలు కూడా పొందవచ్చని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు పంటల మార్పిడిని చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు.  

సాగర్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయం

త్వరలో జరగబోయే సాగర్‌ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు తాము చర్చకు సిద్ధమని జానారెడ్డి చర్చ రావాలని, వేదిక ఎక్కడైనా ఫర్వాలేదన్నారు. సాగర్‌ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని 2018 ఎన్నికల్లోనే వద్దని వదులుకున్నారన్నారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పాశం సంపత్‌రెడ్డి, ఏడీఏ సుధారాణి, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, స్థానిక సర్పంచ్‌ రమేశ్‌, తాసీల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ముత్తినేని శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo