శనివారం 06 మార్చి 2021
Nalgonda - Jan 30, 2021 , 01:42:06

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం

  • ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

తిప్పర్తి/ మాడ్గులపల్లి/ నల్లగొండ, జనవరి 29 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. తిప్పర్తి మండలం సిలార్‌మియాగూడెంలో పంచాయతీ భవన నిర్మాణ పనులను, తిప్పర్తిలో సీసీ, బీటీ రోడ్ల పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తిప్పర్తిలో సులభ్‌ కాంప్లెక్స్‌, పార్కు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొర్ర సుధాకర్‌, వైస్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, సర్పంచులు ఎర్రమాద కవిత, రొట్టెల రమేశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కంచర్ల ప్రారంభించారు. సర్పంచ్‌ కన్నయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీను, యల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో టీఐఆర్టీ యూనియన్‌ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

VIDEOS

logo