Nalgonda
- Jan 22, 2021 , 01:41:12
దేవరకొండ, పెద్దవూర, జనవరి 21 :పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట పెట్రోల్‌బంక్ వద్ద జరిగిన ప్రమాదంలో దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. ఆటోలో మొత్తం 20 మంది కూలీలు ఉండగా ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందారు. మిగతా వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ భార్య కొట్టెం చంద్రమ్మ(35) మృతి చెందింది. మరో 13 మందికి తీవ్ర గాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్న గండూరి వెంకటమ్మ, గొడుగు లింగమ్మ, నోముల లింగమ్మ, గొడుగు యాదమ్మ, నోముల యాదమ్మ, శంకరమ్మ, మండి అంజమ్మ, నోముల అలివేలు, గొడుగు వెంకటమ్మ, నోముల రాంజి, నోముల నర్సమ్మ, నోముల యాదమ్మలను మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గొండుగు లింగమ్మ, నోముల అలివేలు మృతి చెందారు. మరో ఇద్దరికి దేవరకొండ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
VIDEOS
మిన్నంటిన రోదనలు

పరామర్శించిన ఎమ్మెల్యే : రవీంద్రకుమార్
ప్రమాదం వార్త తెలియగానే దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దవాఖానకు చేరుకున్నారు. మృతుల బంధువులను ఓదార్చి, గాయాల పాలైన వారిని పరామర్శించారు. హైదరాబాద్‌కు తరలించిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయమై మమంత్రి జగదీశ్‌రెడ్డికి సమాచారం అందించారు. స్పందించిన మంత్రి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునే విషయాన్ని కూడా ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
తాజావార్తలు
- ఆమె శక్తి..విశ్వవ్యాప్తి
- అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించాం
- కీసరగుట్టకు ప్రత్యేక బస్సులు
- విద్యుత్ సమస్యలకు చెక్
- చిరు వ్యాపారులకు వడ్డీ మాఫీ
- బీజేపీకి గుణపాఠం తప్పదు
- టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికి భారీ మెజార్టీతో గెలిపించండి..
- సంఘటితంగా కృషి చేయాలి
- సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మల్లారెడ్డి
- బిట్‌శాట్ 2021
MOST READ
TRENDING