సోమవారం 01 మార్చి 2021
Nalgonda - Dec 22, 2020 , 00:16:11

క్రిస్మస్‌ దుస్తుల పంపిణీ

క్రిస్మస్‌ దుస్తుల పంపిణీ

మునుగోడు : సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా అవతరించిందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ కానుకగా నియోజకవర్గంలోని క్రైస్తవులకు ప్రభుత్వం అందించిన నూతన దుస్తులను మండల కేంద్రంలో సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలకు ఎన్నికలప్పుడే మైనార్టీలు గుర్తొచ్చేవారని, కానీ టీఆర్‌ఎస్‌ పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ ఇలా అన్ని ప్రధాన పండుగలకు ప్రభుత్వం కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా మత సామరస్యంతో పండుగలను పరస్పరం కలిసి జరుపుకొంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇది తెలంగాణకు మాత్రమే సొంతమైన సంస్కృతీ వారసత్వమని కొనియాడారు. అన్నివర్గాల ప్రజలు తెలంగాణ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో పస్తులుండొద్దనే ఉద్దేశంతోనే అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్‌  అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో నూతన పథకాలకు రూపకల్పన చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కిందని పేర్కొన్నారు. ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలంతా ఆమోదించాలని కోరారు. అనంతరం పాస్టర్లతో కలిసి మంత్రి కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నారబోయిన రవి, ఎంపీపీలు కర్నాటి స్వామియాదవ్‌, తాడూరి వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్వేతారెడ్డి, ఉమా, కళ్యాణి, జడ్పీటీసీలు నారబోయిన స్వరూపారాణి, పాశం సురేందర్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, వెలిగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, వీరమల్ల భానుమతి, చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, వైస్‌ ఎంపీపీ అనంతవీణ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo