– ఏడుగురు వార్డు సభ్యులతో సహా 200 కుటుంబాలు చేరిక
– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల శాఖకు భారీ షాక్ తగిలింది. మండలంలోని పోతిరెడ్డిపాడు, అంగడిపేట ఎక్స్ రోడ్డు నుండి ఏడుగురు వార్డు మెంబర్స్, యూత్ కాంగ్రెస్ సభ్యులతో పాటు సుమారు 200 కుటుంబాలు గురువారం దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతు.. ఈ చేరిక ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేక విఫలం అయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా రైతు భరోసా లేక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చెయలేదని అన్నారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బిల్య్ నాయక్, కిషన్ నాయక్, వల్లపు రెడ్డి, కున్ రెడ్డి, రాజేందర్, సినయ్య, కిషన్, కిరునాయక్, వెంకటయ్య, అంజిరెడ్డి, నర్సింహా, యాదగిరి, పరమేజ్, జగన్, సుధాకర్ గౌడ్, కృష్ణ రెడ్డి, గిరి, సైదులు, నాగరాజు, మహేందర్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. పీఏ పల్లిలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు