ఆరుతడి పంటల సాగే ఉత్తమం
ప్రస్తుత వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు వర్షాభా వ పరిస్థితిని గమనించి ఆరుతడి పం టలు సాగు చేయడం ఉత్తమమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పీఏసీఎస్‌లో యూ రియా నిల్వలను తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
- జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం
- సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి
నేరేడుచర్ల, జూన్ 18 : ప్రస్తుత వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు వర్షాభా వ పరిస్థితిని గమనించి ఆరుతడి పం టలు సాగు చేయడం ఉత్తమమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల పీఏసీఎస్‌లో యూ రియా నిల్వలను తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఆరు లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 4.84 లక్షల ఎకరాల్లో వరి, 70 వేల నుంచి 90 వేల ఎకరాల్లో వరకు పత్తి, మిగిలిన ఎకరాల్లో పెసర, కంది, జొన్న సాగు అవుతుందన్నారు. గతేడాది 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో వినియోగించామని, ఇప్పుడు 70 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతానికి జిల్లాలో 19 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. జూన్ నుంచి పంట కాలం పూర్తయ్యే వరకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలన్నారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని అన్ని మండలాల్లో యూరియా యాప్ ప్రారంభమైందన్నారు. దొడ్డు రకం ధాన్యానికి డిమాండ్ లేనందున రైతులు సన్నరకం పండించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మండల వ్యవసాయ అధికారి జావిద్, సహకార సంఘం సిబ్బంది మధు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

