కట్టంగూర్, ఏప్రిల్ 13 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చిన్నపురి ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్ పాపయ్య ఉపాధ్యాయులు కొంక ప్రవీణ్, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, లూయిస్ మేరీ, శౌరమ్మ, శోభ, విమల, లలితలను పూర్వ విద్యార్థులు శాలువాలు పూలమాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల శంకర్, పాండు, రామాచారి, శరత్, జాన్ పాల్, ప్రసన్న, రాణి తదితరులు పాల్గొన్నారు.