కోదాడ, జూలై 10 : కోదాడ పట్టణంలోని వాయిలసింగారం రోడ్డులో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్(ఐవీఓ)కోదాడ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరించే నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. పట్టణ సీఐ రాము, పీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ సైనిక అధికారి, ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్, జిల్లా అధ్యక్షుడు గుండా మధుసూదన్‌రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నాడు దేశ రక్షణ కోసం సైన్యంలో పోరాడిన సైనికులు నేడు ఉద్యోగ విరమణ చేసి ఐవీఓ ద్వారా సమాజ శ్రేయస్సు కోసం కృషిచేయడం ప్రశంసనీయమని పట్టణ సీఐ రాము, పీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలతో యువతలో జాతీయ భావం కలుగుతుందని తెలిపారు. వంద అడుగుల జాతీయ జెండా నిర్మాణంతో కోదాడ పట్టణం ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చెప్పారు. మాజీ సైనిక అధికారి మధుసూదన్‌రావు మాట్లాడుతూ ఐవీఓ లక్ష్యం సమాజ సేవ అని, ఈ ఆర్గనైజేషన్‌లో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ సైనికులతోపాటు పలువురు ప్రముఖులకు ఐవీఓ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కార్గిల్ యుద్ధవీరుడు గోపయ్య జయంతి సందర్భంగా కోదాడలోని గోపయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐవీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉజ్జిని రవీందర్రావు, కేరళ స్టేట్ అధ్యక్షుడు దివాకర్, సౌత్ జోన్ కో ఆర్డినేటర్ ప్రభాకర్‌రావు, ప్యాట్రాన్స్, జగని ప్రసాద్, ప్రగతి నాగేశ్వర్రావు, వీరనారి శారద, రమేశ్, లక్ష్మీకల్యాణి, వెంపటి ప్రసాద్, స్థల దాత కత్తి, భగత్, నాగుబండి రంగా తదితరులు పాల్గొన్నారు.