భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం నుంచి బయల్దేరిన రెండు బస్సులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 22 బస్సుల్లో గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు సభకు వెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఓ మందడి ఉపేందర్‌రెడ్డి, ముఖ్య ప్రణాళికాధికారి భూక్యా మాన్యానాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య పాల్గొన్నారు. సంస్థాన్ నారాయణపురం నుంచి ఐదు బస్సుల్లో 250 మంది గిరిజనులు తరలివెళ్లారు. ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.
తుర్కపల్లి : హైదరాబాద్‌లోని బంజారా భవన్ ప్రారంభోత్సవానికి మండలంలోని బంజారా ప్రజాప్రతినిధులు, నాయకులు భారీగా తరలివెళ్లారు. జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భుక్యా సుశీలారవీందర్, సర్పంచ్ సురేశ్‌నాయక్, ఎంపీడీఓ ఉమాదేవి, బంజారా నాయకులు మోతీరాం, భాస్కర్‌నాయక్, నరసింహ తరలివెళ్లిన వారిలో ఉన్నారు.